- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జడ్చర్ల ప్రభుత్వ పాఠశాలలో అగ్ని ప్రమాదం..
by Taduka Kalyani |
జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.

X
దిశ, జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పాఠశాల ఓ గదిలో మంటలు వ్యాపించాయి. ఈ విషయం గమనించిన స్థానికులు స్థానిక ప్రజాప్రతినిధులకు తెలపడంతో పాఠశాల గది వద్దకు చేరుకున్న ప్రజా ప్రతినిధులు స్థానికుల సహాయంతో మంటలు ఆర్పారు. గదిలో ఉన్న బెంచీలు, కొన్ని పత్రాలు దగ్ధమయ్యాయి. పాఠ పాఠశాల గది గోడలు మంటల తాకిడికి పెచ్చులూడి పడుతున్నాయి. ఈ ఘటనపై ఎంఈఓ మంజులాదేవి విచారణ చేపడుతున్నామని దగ్ధమైన సామాగ్రి విలువను అంచనా వేస్తున్నామని తెలిపారు.
Next Story






