జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్ర‌మాదం.. ఇద్ద‌రు స‌జీవ ద‌హ‌నం

by Ratna Kumari |   (  Updated:2025-11-18 15:15:37  IST  )

దిశ, జడ్చర్ల : జిన్నింగ్ మిల్లు అగ్ని ప్రమాదం సంభవించి ఇద్దరు కార్మికులు సజీవ దహనం కావడంతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం జడ్చర్ల మండల పరిధిలోని

జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్ర‌మాదం.. ఇద్ద‌రు స‌జీవ ద‌హ‌నం
X

దిశ, జడ్చర్ల : జిన్నింగ్ మిల్లు అగ్ని ప్రమాదం సంభవించి ఇద్దరు కార్మికులు సజీవ దహనం కావడంతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం జడ్చర్ల మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద ఉన్న సలసర్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో చోటు చేసుకుంది మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద ఉన్న సలసర్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది కార్మికులు నిత్యం పనిచేస్తుంటారు. అందులో భాగంగానే మంగళవారం అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించింది. ఇదే సమయంలో మిల్లులోని బయటికి గాలి ఈడ్చే పైపు లైన్ లో చెత్త ఇరుక్కుందని వాటిని తొలగించేందుకు ఒడిశా రాష్ట్రానికి చెందిన పప్పు 26, బీహార్ రాష్ట్రానికి చెందిన హరేందర్ 23 వెళ్లారు. ఈ క్రమంలో అటుపక్క అంటుకున్న మంటలు ఒక్కసారిగా ఎగసిపడడంతో ఇద్దరు అగ్నికి ఆహుతి అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన‌ ఇద్దరికీ ఇటీవలే వివాహం అయిందని తోటి కార్మికులు తెలిపారు. ఈ ఘటనతో బీహార్, ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులు కంపెనీ యజమాన్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ వద్ద పోలీసులతో కంపెనీ యజమాన్యం పై దాడికి దిగారు. పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉండడంతో పోలీసులు అదనపు బలగాలను కంపెనీ వద్దకు రప్పించారు.

ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన కార్మికులు కంపెనీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంపెనీ యజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ తోటి కార్మికులు సజీవ దహనమయ్యారని మరో ఇద్దరు చావు బతుకుల మధ్య మధ్య కొట్టుమిట్టాడుతున్నారని కంపెనీ యజమాన్యాన్ని తమ ముందుకు తీసుకురావాలని పోలీసులతో కార్మికులు వాగ్వివాదానికి దిగారు. దీంతో పోలీసులు వారికి ఏమి వారించలేని పరిస్థితి. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్పీ జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు ప్రమాదం జరిగిన వెంటనే జడ్చర్ల ఫైర్ సిబ్బందితోపాటు షాద్ న‌గ‌ర్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఫైర్ వాహనాలను ఘటన స్థలానికి రప్పించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇద్దరు కార్మికుల సజీవ దహనం అవ్వ‌డంతో పాటు మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని వారిని మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

గొల్లపల్లి వద్ద ఉన్న సరసర్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో ప్రతి సంవత్సరం రెండుసార్లు అగ్నిప్రమాదం సంభవిస్తూ ఉంటుందని దాని గల కారణాలు ప్రతిసారి షార్ట్ సర్క్యూట్ అని యజమాన్యం తప్పించుకుంటూ కంపెనీ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే ఇవాళ‌ జరిగిన అగ్నిప్రమాదం కూడా అలాగే ఉంటుందని కార్మికులు ఆరోపించారు. ప్రతి సంవత్సరం రెండుసార్లు అగ్ని ప్రమాదం ఒకే కంపెనీలో ఎలా జరుగుతుందని ఈ ఘటనపై ఇండస్ట్రియల్ అధికారులు ఎందుకు విచారణ చేపట్టడం లేదో అని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిన్నింగ్ మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని ప్రమాదకర ప్రాంతాల్లో కూడా ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా కార్మికుల చేత పనులు చేయిస్తారని కార్మికులు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ.50ల‌క్ష‌లు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తీవ్రంగా గాయ‌ప‌డిన కుటుంబాల‌కు మెరుగైన వైద్య చికిత్స‌తో పాటు వారికి రూ.20ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించాల‌ని బీఆర్ఎస్, సీఐటీయూ నాయ‌కులు డిమాండ్ చేశారు.

Next Story