హైదరాబాద్ నడిరోడ్డుపై కారులో మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

by Ajay Maddhiboyina |

హైద‌రాబాద్ కూక‌ట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఓ కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు గమణించిన ప్రయాణికులు వెంటనే కారు దిగి పక్కకు వెళ్లారు.

హైదరాబాద్ నడిరోడ్డుపై కారులో మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
X

దిశ‌, వెబ్ డెస్క్: హైద‌రాబాద్ కూక‌ట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఓ కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు గమణించిన ప్రయాణికులు వెంటనే కారు దిగి పక్కకు వెళ్లారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే కారులో మంటలు ఎందుకు అంటుకున్నాయో ఇంకా తేలియలేదు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలోనే ఉన్నట్టుండి కార్లలో మంటలు చెలరేగుతున్నాయి. హైదరాబాద్ లోనే ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రమాదాల్లో వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేస్తే మరికొన్ని ఘటనల్లో మాత్రం కార్లు పూర్తిగా దగ్దం అవుతున్నాయి.

Next Story