Fire Accident: ఆయిల్ కంపెనీలో పేలిన బాయిలర్.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు

by Kema Shiva Kumar |

భారీ పేలుడు సంభవించిన ఘటన రంగారెడ్డి (Rangareddy) జిల్లా ఫరూఖ్‌నగర్ (Farooq Nagar) మండల పరిధిలోని అన్నారం (Annaram)లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Fire Accident: ఆయిల్ కంపెనీలో పేలిన బాయిలర్.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: భారీ పేలుడు సంభవించిన ఘటన రంగారెడ్డి (Rangareddy) జిల్లా ఫరూఖ్‌నగర్ (Farooq Nagar) మండల పరిధిలోని అన్నారం (Annaram)లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీఆర్ఎస్ రిఫైనరీస్ ఆయిల్ కంపెనీ (BRS Oil Company)లో ఉన్నట్టుండి బాయిలర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో కంపెనీలో భారీ ఎత్తున మంటలు ఎగసిడ్డాయి. ఎడిబుల్ ఆయిల్ (Edible Oil) నిల్వ ఉంచిన ట్యాంకర్ కారణంగా పెద్ద పెద్ద శబ్ధాలతో పేలుడు సంభవించింది. కార్మికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మొత్తం నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినా, మంటలు అదుపులోకి రాలేదని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 30 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story