- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fire Accident: రాష్ట్రంలో తీవ్ర విషాదం.. ఇద్దరు మహిళలు సజీవ దహనం
by Kema Shiva Kumar |
రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా ఇద్దరు మహిళలు సజీవ దహనమైన హృదయ విదారక ఘటన బాపట్ల (Bapatla) జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పర్చూరు (Parchur)లోని తూర్పు బజార్‌లో అర్ధరాత్రి దాటాక ఓ ఇంట్లో షాక్ సర్క్యూట్ (Short Circuit)తో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ దర్ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న నాగమణి (35), మాధవీలత (28) సజీవ దహనం అయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. అనంతరం మృతదేహాలను వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story






