- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fire Accident: నగరంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతోన్న మంటలు
by Kema Shiva Kumar |
భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన ఘటన హైదరాబాద్ (Hyderabad) నగర శివారులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన ఘటన హైదరాబాద్ (Hyderabad) నగర శివారులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట (Nizampet) పరిధిలోని ఈ- ఫిట్‌నెస్ సెంటర్ (E Fitness Center) సమీపంలో ఉన్న టిఫిన్ సెంటర్ (Tiffin Center)లో గ్యాస్ వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో మొత్తం మూడు షాపులు కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






