- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేరేడుచర్లలో మద్యం మత్తులో యువకుల వీరంగం..
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఆదివారం సాయంత్రం వైన్ షాపులో జరిగిన చిన్న గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

దిశ, నేరేడుచర్ల : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఆదివారం సాయంత్రం వైన్ షాపులో జరిగిన చిన్న గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మద్యం సేవిస్తున్న సమయంలో మాటామాటా పెరిగి ఇద్దరు యువకుల మధ్య దాడికి దారి తీసిన ఘటన, ఆ తర్వాత వర్గీయ దాడిగా మారింది.
స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం, నేరేడుచర్ల పట్టణంలోని రాంపురం రోడ్డులో ఉన్న ఓ వైన్ షాపులో నలుగురు నేరేడుచర్ల యువకులతో పాటు పెంచికలదిన్నె గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పక్కపక్కనే కూర్చొని మద్యం సేవిస్తున్నారు. మద్యం మత్తులో మాటలు ఘర్షణకు దారి తీసి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో మొదట నేరేడుచర్లకు చెందిన యువకులను పెంచికలదిన్నె యువకులు చితకబాదినట్లు సమాచారం.
ఈ విషయాన్ని నేరేడుచర్ల వర్గానికి చెందిన వారు తమ బంధువులకు ఫోన్ ద్వారా తెలియజేయడంతో వారు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని పెంచికలదిన్నె గ్రామానికి చెందిన ఇద్దరు యువకులపై తీవ్రంగా దాడి చేశారు. మధ్యలో పోలీసుల హస్తక్షేపం జరిగినప్పటికీ, దాడిలో పాల్గొన్నవారు వారిని రోడ్డుపై తన్నుతూ, చివరికి మురికి కాలువలోకి తోసివేశారు.
ఈ దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనకు అసలు కారణాలపై క్లారిటీ రావాల్సి ఉంది. రెండు వర్గాలకు చెందిన గాయపడిన యువకులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.






