- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ మహిళా టీచర్‌కు బెయిల్
ముంబైలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై మహిళా టీచర్ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ముంబైలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై మహిళా టీచర్ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో టీచర్‌కు బెయిల్ మంజూరయ్యింది. ఘటనలో టీచర్‌పై నమోదైన పోక్సో కేసును విచారించి, ప్రత్యేక పోక్సో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితురాలు ఆ స్కూల్‌లో ఉద్యోగానికి రాజీనామా చేయడంతో, ఇక ఆ విద్యార్థితో సంబంధం ఉండదని, అతడిపై టీచర్ ప్రభావం తగ్గిపోతుందని కోర్టు వివరణ ఇచ్చింది. టీచర్ ఆ బాలుడిని మళ్లీ కలవకూడదని, బెదిరింపులకు పాల్పడకూడదని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలా ఉంటే 2023 డిసెంబర్‌లో స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా డ్యాన్స్ చేసిన విద్యార్థికి అట్రాక్ట్ అయిన టీచర్ అతడిని లోబరుచుకుని పలుమార్లు అతడితో శృంగారంలో పాల్గొంది. స్టార్ హోటల్స్ కు తీసుకువెళ్లి మద్యం తాగిస్తూ అత్యాచారినికి పాల్పడింది. విద్యార్థి ఆందోళన చెందడంతో అతడికి యాంటీ యాంక్సైటీ టాబ్లెట్స్ ఇచ్చింది. విద్యార్థి ప్రవర్తనలో మార్పు రావడంతో తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో అసలు నిజం బయటపెట్టాడు. తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా టీచర్ పై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.






