దారుణం: కూతురు పెళ్లి మండపంలోనే తండ్రి మరణం..

by Chukka Sudharani |

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం జరిగింది. కూతురు పెళ్లి జరిగిన కొద్ది సేపటికే అదే మండపంలో తండ్రి మరణించారు.

దారుణం: కూతురు పెళ్లి మండపంలోనే తండ్రి మరణం..
X

దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం జరిగింది. కూతురు పెళ్లి జరిగిన కొద్ది సేపటికే అదే మండపంలో తండ్రి మరణించారు. విఠల్ నగర్‌కు చెందిన ఎలిగేటి శంకర్ (56) అనే వ్యక్తి భార్య. కుమారుడు, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా.. స్థానిక సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో బుధవారం కూతురి వివాహం ఘనంగా జరిపించాడు. అప్పటివరకు పెళ్లి పందిట్లో సందడిగా తిరిగాడు. బంధువులు, మిత్రులతో సరదాగా గడిపి కుమార్తె వివాహాన్ని కళ్లారా చూసి ఆనందపడ్డాడు.

కానీ, ఆ సంతోషం ఎంతోసేపు నిలబడలేదు. అలసటగా ఉందని కుర్చీలో కూర్చున్నాడు. కొద్ది సేపటికే కుర్చీలోనే కుప్పకూలాడు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు శంకర్‌ను ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న పెళ్లి ఇళ్లు విషాదంలోకి కూరుకుపోయింది. అయితే.. శంకర్‌ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆ కారణం చేతనే ఆయన మరణించి ఉంటారని బంధువులు భావిస్తున్నారు.

Next Story