- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీలో దారుణం.. తన కూతురును ప్రేమించాడని మెడలో చెప్పుల దండవేసి ఊరేగించిన తండ్రి
యూపీలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురును ప్రేమించాడని యువకుడిని చిత్రహింసలు పెట్టాడు ఓ తండ్రి. అనంతరం చెప్పుల దండవేసి ఊరంతా తిప్పాడు.

దిశ, వెబ్ డెస్క్: యూపీలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురును ప్రేమించాడని యువకుడిని చిత్రహింసలు పెట్టాడు ఓ తండ్రి. అనంతరం చెప్పుల దండవేసి ఊరంతా తిప్పాడు. ఈ అమానవీయ ఘటన ఔరైయా జిల్లాలోని రాంపూర్ లో చోటు చేసుకుంది. ఉపేంద్ర అనే యువకుడు గ్రామంలోని ఓ యువతిని ప్రేమించాడు. ఆ ప్రేమ వ్యవహారం ఇష్టంలేదని యువతి తండ్రి పలుమార్లు తన కూతురును విడిచిపెట్టాలని హెచ్చరించాడు.
అయినప్పటికీ యువకుడి తీరు మారలేదు. యువకుడితో తన కూతురు ప్రేమ వ్యవహారం అలానే కొనసాగింది. ఈ క్రమంలో యువతి తండ్రి రెచ్చిపోయాడు. బంధువుల సహాయంతో యువకుడిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. అనంతరం మెడలో చెప్పుల దండవేసి ఊరేగించారు. అక్కడితో ఆగకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అవ్వడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.






