రూ. 12లక్షల సుపారీ.. కాంట్రాక్ట్ కిల్లర్స్‌తో కలిసి.. కన్న తండ్రిని దారుణంగా హత్య చేసిన కొడుకు..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ హాపూర్ జిల్లాలో కన్న తండ్రిని హత్య చేశాడు కొడుకు. తాతార్‌పూర్ గ్రామానికి చెందిన రైతు మన్‌వీర్‌కు గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. కానీ అతను ఆ భూమిని కొడుకు విశాల్ పేరు మీద రాయకుండా.. అదే గ్రామానికి చెందిన సాంప్రదాయ వైద్యుడి

రూ. 12లక్షల సుపారీ.. కాంట్రాక్ట్ కిల్లర్స్‌తో కలిసి.. కన్న తండ్రిని దారుణంగా హత్య చేసిన కొడుకు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ హాపూర్ జిల్లాలో కన్న తండ్రిని హత్య చేశాడు కొడుకు. తాతార్‌పూర్ గ్రామానికి చెందిన రైతు మన్‌వీర్‌కు గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. కానీ అతను ఆ భూమిని కొడుకు విశాల్ పేరు మీద రాయకుండా.. అదే గ్రామానికి చెందిన సాంప్రదాయ వైద్యుడి కుమారుడికి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇది తట్టుకోలేని విశాల్.. తండ్రిని చంపేస్తే భూమి ఎటూ పోదని ప్లాన్ చేశాడు. అనుకున్నట్లుగానే రూ.12లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. ముందుగా మన్‌వీర్‌ గొంతును కత్తితో కోసిన కాంట్రాక్ట్ కిల్లర్స్.. ఆ తర్వాత ఆనవాళ్లు కనిపించకుండా అతని ముఖంపై ఇటుకతో బాదారు. నుజ్జునుజ్జు చేశారు. ఆగస్టు 26న అతని మృతదేహం పొలంలో కనుగొనబడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. కన్న కొడుకే ఆస్తి కోసం ఇదంతా చేశాడని తేలింది. పోలీసులు కొడుకుతోపాటు ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

Next Story