తమిళనాడులో దారుణం.. భార్య మరొకరితో వెళ్లిపోయిందని ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి

by Ajay Maddhiboyina |

త‌మిళనాడులో దారుణం చోటు చేసుకుంది. భార్య మ‌రో వ్య‌క్తితో వెళ్లిపోయింద‌ని ముగ్గురు పిల్ల‌ల‌ను తండ్రి దారుణంగా హ‌త‌మార్చాడు. ఈ ఘ‌ట‌న తంజావూరులో జ‌రిగింది. నింధితుడు ఎస్. వినోద్ కుమార్ మ‌దుక్కూర్ స‌మీపంలోని ఓహోట‌ల్ లో వెయిట‌ర్‌గా పనిచేస్తున్నాడు.

తమిళనాడులో దారుణం.. భార్య మరొకరితో వెళ్లిపోయిందని ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌మిళనాడులో దారుణం చోటు చేసుకుంది. భార్య మ‌రో వ్య‌క్తితో వెళ్లిపోయింద‌ని ముగ్గురు పిల్ల‌ల‌ను తండ్రి దారుణంగా హ‌త‌మార్చాడు. ఈ ఘ‌ట‌న తంజావూరులో జ‌రిగింది. నింధితుడు ఎస్. వినోద్ కుమార్ మ‌దుక్కూర్ స‌మీపంలోని ఓహోట‌ల్ లో వెయిట‌ర్‌గా పనిచేస్తున్నాడు. నింధితుడికి భార్య నిత్య, ముగ్గురు పిల్లలు ఓవియా (12), కీర్తి(8), ఈశ్వరన్(5) ఉన్నారు.

కాగా వినోద్ భార్య నిత్య‌కు మున్నార్గుడికి చెందిన ఓ వ్య‌క్తితో సోష‌ల్ మీడియా ద్వారా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది కాస్త అక్ర‌మ‌సంబంధానికి దారి తీసి ఆరు నెల‌ల క్రితం అత‌డితో వెళ్లిపోయింది. ఆనాటి నుండి వినోద్ కుమార్ మ‌ద్యానికి బానిస‌య్యాడ‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌ద్యం మ‌త్తుల్లో భార్య వ‌దిలేసి వెళ్లిపోయిందని కోపంతో ర‌గిలిపోయి ముగ్గురు పిల్ల‌ల‌ను ప‌దునైన ఆయుదంతో అత్యంత దారుణంగా హ‌త్య చేశాడు. త‌ర‌వాత స్థానిక పోలీసుల‌కు లొంగిపోయాడు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

Next Story