- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చికెన్ టేస్ట్ చేయలేదనే కోపంతో కొడుకును చంపిన తండ్రి..
ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారు. ఇతరులపై కోపంతో ఊగిపోతూ క్షణికావేశంలో వారి ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడటం లేదు. ఈ మధ్య ఇలాంటి దారుణ ఘటనలు చాలానే జరుగుతున్నాయి. తాజాగా, కర్ణాటకలో కొడుకు చికెన్ కూర రుచి చూడలేదని తండ్రి అతడిని చంపేశాడు.
వివారాల్లోకి వెళితే.. కర్ణాటకలో ఓ కుటుంబం నివాసం ఉంటున్నారు. అయితే తండ్రి షీనా మంగళవారం కోడి కూర వండాడు. ఈ క్రమంలో శివరామ్ బయటకు వెళ్లి రావడంతో కోడికూర ఎలా ఉందో టేస్ట్ చూడమని తండ్రి కొడుకును అడిగాడు. దానికి శివరామ్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అది కాస్త పెరగడంతో ఆగ్రహించిన షినా కొడుకును చెక్కతో కొట్టి చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.






