రాక్షస తండ్రి.. హోమ్ వర్క్ సరిగ్గా రాయలేదని కూతురిపై దారుణం

by Naga Rani Yarlagadda |

కూతురు హోమ్ వర్క్ సరిగ్గా చేయలేదని తీవ్రంగా కొట్టి చంపాడు ఓ రాక్షస తండ్రి. కంటికి రెప్పలా, ఆమెకు తోడుగా నిలబడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు.

రాక్షస తండ్రి.. హోమ్ వర్క్ సరిగ్గా రాయలేదని కూతురిపై దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: కూతురు హోమ్ వర్క్ సరిగ్గా చేయలేదని తీవ్రంగా కొట్టి చంపాడు ఓ రాక్షస తండ్రి. కంటికి రెప్పలా, ఆమెకు తోడుగా నిలబడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫరీదాబాద్ లో జరిగింది. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోన్ భద్ర జిల్లాలోని ఖేరాటియా గ్రామానికి చెందిన జైస్వాల్.. తన కుటుంబంతో ఫరీదాబాద్ లోని అద్దె ఇంటిలో ఉంటున్నాడు. జైస్వాల్, అతని భార్య ఇద్దరూ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లికి పగలు డ్యూటీ, తండ్రికి నైట్ డ్యూటీ. దీంతో పిల్లల్ని జైస్వాలే చూసుకునేవాడు.

అంకెలు సరిగ్గా రాయకపోవడంతో..

తన నాలుగేళ్ల కుమార్తెతో స్కూల్ నుంచి వచ్చాక హోమ్ వర్క్ చేయించేవాడు. ఈ క్రమంలో జనవరి 21న జైస్వాల్ తన కూతుర్ని 1 నుంచి 50 వరకూ అంకెలు రాయమని చెప్పాడు. వాటిని క్రమంలో రాయలేకపోవడంతో ఆమెపై కోపడ్డాడు. తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయింది. సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన తల్లి.. కూతురు ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో కంగారుపడింది. ఎంత లేపినా లేవకపోవడంతో చనిపోయిందని గ్రహించింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది. వారింటికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. పోస్టుమార్టం పూర్తయ్యాక చిన్నారి మృతదేహాన్ని ఆ కుటుంబానికి అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. తండ్రిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

Next Story