- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్కాపూర్ లో దారుణం : పిల్లల్ని చంపి.. తండ్రి సూసైడ్
తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడో తండ్రి. మృతులు మారిన్ (13), ఆరాధ్య (10), సుభాష్ (42)లుగా గుర్తించారు.

దిశ, సంగారెడ్డి అర్బన్ / కొండాపూర్ : ఓ తండ్రి పేగు తెంచుకొని పుట్టిన తన ఇద్దరు పిల్లల్ని చంపేశాడు. ఆ తర్వాత మనస్తాపంతో తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొండాపూర్ సీఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం కొండాపూర్ మండలం మల్కాపూర్ శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్న బాయికాడి సుభాష్ (45) ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య మంజుల (35), కొడుకు మరియన్ (13), కూతురు ఆరాధ్య (9) ఉన్నారు. అయితే తన భార్య గొడవల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయింది.
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సుభాష్ తన ఇద్దరు పిల్లల్ని కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తాను అదే ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నాలుగు రోజులు క్రితం జరగగా సోమవారం ఉదయం స్థానికుల సమాచారంతో వెలుగులోకి వచ్చింది. అయితే కన్నతండ్రి ఇంత దారుణానికి ఒడిగట్టాల్సిన అవసరం ఏమై ఉంటుంది అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం, పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






