- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగుపాటుతో తండ్రి, కూతురు దుర్మరణం
by Sridhar Babu |
పిడుగుపాటుకు తండ్రి, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటన కామేపల్లి మండల పరిధిలోని మద్దులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

X
దిశ,కారేపల్లి (కామేపల్లి) : పిడుగుపాటుకు తండ్రి, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటన కామేపల్లి మండల పరిధిలోని మద్దులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చింతల లింగస్వామి ఆయన భార్య, కూతురు కావేరి పొలం పనులు చేస్తుండగా మంగళవారం వర్షం రావడంతో పొలం సమీపంలోని చెట్టు కిందికి వెళ్లారు. ఉరుముల మెరుపులతో వర్షం వస్తున్న క్రమంలో చెట్టుపై పిడుగు పడడంతో తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి కామేపల్లి పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- lightning
Next Story






