- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హతవిధీ..! చావులోనూ ఒక్కటై: బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు దుర్మరణం
రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్‌తో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. కాగా, ఈ దుర్ఘటనలో దురదృష్టవశాత్తు ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఓకేసారి దుర్మరణం పాలయ్యారు. తాండూరు పట్టణంలో గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు అనూష, సాయిప్రియ, నందిని కలిసి తాండూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. వారి మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ బోరున విలపిస్తున్నారు. ఆ హృదయ విదారక దృశ్యాలు చూసిన తాండూరు పట్టణమంతా శోకసంద్రంలో మునిగింది. మరోవైపు మీర్జాగూడ ప్రమాదంపై హుటాహుటిన తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అదేవిధంగా మృతుల కుటుంబాలకు రూ.7 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది.
Read More.. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో అరణ్య రోదన.. బస్సు ప్రమాదంలో 21కి చేరిన మృతుల సంఖ్య
నా ముగ్గురు పిల్లల్ని ఎవరు తీసుకొస్తారు ? : ఆస్పత్రిలో తల్లి ఆవేదన






