- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి
రెండు తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం తెల్లవారుజామునే రహదారులు రక్తసిక్తమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం తెల్లవారుజామునే రహదారులు రక్తసిక్తమయ్యాయి. ఏపీ, తెలంగాణలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో మొత్తం ఆరుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని తుమ్మనూరులో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకెళ్లిన ఓ కారు అదుపుతప్పి డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతులను నాగర్ కర్నూల్ జిల్లా వాసులుగా గుర్తించారు. మరణించారు వారు కేశవులు (35), శ్రీనివాసులు (30), యాదయ్య (34), రామస్వామిగా (32) గుర్తించారు.
ఇదిలా ఉండగా.. ఏపీలోని నెల్లూరు జిల్లా మనుబోలు కాగితాలపూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో దూసుకెళ్లిన వోల్వో బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తోన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రెట్టపల్లికి చెందిన శీనయ్య, ఈశ్వరయ్యగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యా్ప్తు చేస్తున్నట్లు తెలిపారు.






