ఏదుల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

by velandi.Saikiran |

ఏదుల సమీపంలో గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు.

ఏదుల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
X

*మంత్రాలమ్మ జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం*

*అక్కడిక్క‌డే ఇద్దరు మృతి*

*ప్రమాదం అనంతరం పరారైన ట్రాక్టర్ డ్రైవర్లు*

రేవల్లి, దిశ: మండల కేంద్రం ఏదుల సమీపంలో గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. సంఘటన వివ‌రాలు ఇలా ఉన్నాయి. రేవల్లి మండలం కొంకలపల్లి గ్రామాస్తులు, గురువారం ఉదయం కోడేరు మండలం జనుంపల్లిలో జరుగుతోన్న మంత్రాలమ్మ జాతరకు ఆటోలో వెళ్లారు.

దైవ దర్శనం అనంతరం రాత్రి 10 గంటల‌కు తిరిగి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే ఏదుల స‌మీపంలో రెండు ట్రాక్టర్ల డోర్లు ఆటోకు బలంగా ఢీకొట్టింది. దీంతో కుమారి వెంకటయ్య (52) అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్ప‌త్రికి త‌రలిస్తుండ‌గా సుమిత్రమ్మ మృతి చెందారు. మ‌రో ఐదారుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయ‌ప‌డిన వారిని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు ప్రమాదం అనంతరం ట్రాక్టర్ డ్రైవర్లు పరారయ్యారు. ఇక ఈ సంఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story