- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు నడిరోడ్డుపైనే సజీవ దహనమైన హృదయ విదారక ఘటన తమళనాడు (Tamilnadu)లో ఇవాళ చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు నడిరోడ్డుపైనే సజీవ దహనమైన హృదయ విదారక ఘటన తమళనాడు (Tamilnadu)లో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఐదుగురు యువకులు కలిసి కారులో చెన్నై (Chennai) నుంచి మున్నార్ (Munnar) ట్రిప్‌కు బయలుదేరారు. ఈ క్రమంలోనే వారి కారు విక్రవాండి (Vikravandi)లోని నాగమ్మాయి కాట్ మిల్లు వద్దకు చేరుకోగానే అతివేగంతో ఒక్కాసారికి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసుల వెల్లడించారు.






