రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్, 22 మందికి గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-17 02:21:58  IST  )

రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని చిత్తూరు (Chittoor) సమీపంలో చోటుచేసుకుంది.

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్, 22 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని చిత్తూరు (Chittoor) సమీపంలో శుక్రవారం తెల్లవారుజుామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో తిరుపతి (Tirupati) నుంచి తిరుచ్చి (Trichy)కి వెళ్తోంది. ఈ క్రమంలోనే బస్సు చిత్తూరు (Chittoor) సమీపంలోని గంగాసాగరం (Gangasagaram) వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన టిప్పర్‌ను తప్పించబోయి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులోని నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 22 మందికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమర్ (Collector Sumit Kumar), పోలీసులు క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆసుపత్రి (Chittoor District Hospital)కి తరలించారు. తీవ్ర గాయలైన వారిని సీఎంసీ (CMC) వేలూరు ఆసుపత్రికి తరలించారు.

Next Story