ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసులు మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-26 00:10:58  IST  )

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల - బత్తలూరు మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల - బత్తలూరు మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో నేషనల్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు.. అదుపుతప్పి డివైడర్ ను దాటి ఎదురుగా వస్తోన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ ట్రావెలర్ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తుందని, ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై పోలీసుల కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

Next Story