- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
దిశ, పెద్ద కొత్తపల్లి : నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే

దిశ, పెద్ద కొత్తపల్లి : నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ - కొల్లాపూర్ మధ్య 167 జాతీయ రహదారి పై పెద్ద కొత్త పల్లి మండలం అదిరాల వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గ్రామం సమీపంలో ఊర కుంట వద్ద రోడ్డు మీద టీఎస్ 31సీ, 2066 నెంబర్ గల మోటార్ బైక్ పై వెళ్తూ పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన నాగపూరి చిన్న నర్సయ్య కింద పడి గాయాలపాలయ్యాడు. అదే రోడ్డు పై వెళ్తున్న ఓ గుర్తు తెలియని (56) వ్యక్తి మెదడు చిట్లి ప్రాణాలు విడిచాడు. అయితే ఆ వ్యక్తి ని ఇదే బైక్ డీ కొట్టడమా! లేక వేరే వాహనం డీ కొట్టిందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే రోడ్డు లో నాగర్ కర్నూల్ వైపు నుంచి ఎస్సై సతీష్ వస్తున్నారు. రోడ్డు ప్రమాద ఘటన స్థలం లో చనిపోయిన వ్యక్తి మృత దేహాన్ని గాయాలపాలైన చిన్న నర్సయ్య ను 108 అంబులెన్సు లో నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన పై ఎవ్వరు ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని ఎస్సై సతీష్ తెలిపారు.






