- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భీమిలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
by Malleboina Mahesh |
విశాఖపట్నం జిల్లా భీమిలి వలందపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖపట్నం జిల్లా భీమిలి వలందపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిద్ర మత్తులో ఉన్న బస్సు డ్రైవర్ డివైడర్‌ను ఢీకొట్టాడు. అదే సమయంలో బస్సు వెనకే వస్తున్న లారీ బస్సుని ఢీకొంది. దీంతో లారీ వెనక వస్తున్న కారు లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన లాడే దుర్గాప్రసాద్, పట్నాల సంతోష్ గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Next Story






