- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటేకల్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా, అతి వేగం కారణంగా ప్రమాదాలు క్రమ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. పొద్దున లేస్తే చాలు ఎక్కడ ఏం ప్రమాదం జరుగుతుందో ? అనే టెన్షన్ నెలకొంటోంది. ఇటీవల కాలంలో ఆర్టీసీ, లగ్జరీ బస్సులు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. అయితే తాజాగా ఏపీలో మరో ప్రమాదం జరిగింది.
కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటేకల్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఏకంగా ఐదుగురు మరణించారు. మరి కొంతమందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయాల పాలైన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారట. ఈ రోడ్డు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైన సంగతి తెలిసిందే.
ఈ ప్రమాదంలో ఏకంగా 19 మంది మరణించారు. కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైన సంఘటన అక్టోబర్ 24వ తేదీన చోటుచేసుకుంది. రోడ్డు మధ్యలో ఉన్న ఓ మోటార్ సైకిల్ ను ఈ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి పూట ప్రయాణికులందరూ పడుకున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే వాళ్లు మేలుకునే లోపు ప్రమాదం జరిగిపోయింది. దీంతో కొంతమంది గాయాలతో బయటపడగా, 19 మంది స్పాట్ లోనే మృతి చెందారు. ఇక ఆ ప్రమాదం మరువక ముందే ఇప్పుడు అదే కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
- Tags
- road accident
- AP






