- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాదీలు మృతి
by Malleboina Mahesh |
అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మాస్టర్స్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈ నెల 24న కెంటకీలోని జాన్స్‌బర్గ్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మాస్టర్స్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈ నెల 24న కెంటకీలోని జాన్స్‌బర్గ్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జాన్స్‌బర్గ్ హైవేపై వెళుతున్న కారు అదుపుతప్పి ఓ ట్రాక్టర్ ట్రెయిలర్ పైకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నట్టు వెల్లడించారు.
ఇద్దరు మాస్టర్స్ విద్యార్థులు మహమ్మద్ ఫైసల్, ఇషాముద్దీన్‌లుగా గుర్తించారు. మూడో విద్యార్థికి తీవ్రగాయాలు కాగా అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉన్నత విద్య కోసం ఈ ముగ్గురు విద్యార్థులు అమెరికాకు వెళ్లగా ఈ విషాదం చోటుచేసుకుంది. వారి మృతదేహాలు హైదరాబాద్ చేరుకున్నాయి. మహ్మద్ ఫైసల్, ఇషాముద్దీన్‌లకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
Next Story






