బీరెల్లి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

జోగులాంబ గద్వాల జిల్లా బీరెల్లి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో త‌లారి శ్రీను అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.

బీరెల్లి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. వ్య‌క్తి మృతి
X

దిశ‌, గ‌ద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లా బీరెల్లి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో త‌లారి శ్రీను అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్ర‌కారం.. ముల‌క‌ల‌ప్లి గ్రామానికి చెందిన త‌లారి శ్రీను(45) బైకు పై గ‌ద్వాల నుంచి ముల్క‌ల‌ప‌ల్లి వైపు వెళ్తున్నాడు. అదే స‌మ‌యంలో జ‌ముల‌మ్మ నుంచి ముల్క‌ల‌ప‌ల్లి వైపు ట్రాక్ట‌ర్ వెళ్తోంది. బీరెల్లి చౌర‌స్తా వ‌ద్ద బైకును ఢీ కొట్టిన‌ట్టు స‌మాచారం. దీంతో త‌లారి శ్రీను ట్రాక్ట‌ర్ వెనుక టైర్ కింద ప‌డ్డాడు. దీంతో శ్రీను అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. వెంట‌నే సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు పోలీసు సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ప్ర‌మాదం పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story