బ్యాంక్ నోటీసులు.. అప్పుల ఊబిలో కూరుకుపోయి.. ఆత్మహత్య చేసుకున్న రైతన్న

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ బందా జిల్లాకు చెందిన రైతన్న అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. తీసుకున్న అప్పు చెల్లించాలని బ్యాంక్ నోటీసులు రావడంతో ఆందోళన చెంది చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. అమ్లీ కౌర్ గ్రామానికి చెందిన ద్వారికా సింగ్..

బ్యాంక్ నోటీసులు.. అప్పుల ఊబిలో కూరుకుపోయి.. ఆత్మహత్య చేసుకున్న రైతన్న
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బందా జిల్లాకు చెందిన రైతన్న అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. తీసుకున్న అప్పు చెల్లించాలని బ్యాంక్ నోటీసులు రావడంతో ఆందోళన చెంది చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. అమ్లీ కౌర్ గ్రామానికి చెందిన ద్వారికా సింగ్.. 11ఏళ్ల క్రితం బెండా బ్రాంచ్ ఆర్యవర్ట్ బ్యాంక్ నుంచి రూ.57వేల రుణం తీసుకున్నాడు. కానీ ఇచ్చిన రుణం తీర్చకపోవడంతో అది ఇప్పుడు లక్షా 44వేల రూపాయలకు చేరింది. దీంతో లోన్ కట్టాలని మేలో నోటీసులు పంపింది బ్యాంక్. ఆ తర్వాత ఆగస్టులో రెండో నోటీసు రాగా దీని గురించే ఆలోచిస్తూ, ఆందోళన చెందుతున్నాడు. పైగా అక్టోబర్ 10న లోక్ అదాలత్‌లో దీనిపై విచారణ జరగాల్సింది ఉంది. దీంతో భయపడిపోయిన రైతు సూసైడ్ చేసుకున్నాడు.

Next Story