విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి యువరైతు బలి

by Bhanu |

నేరడిగొండ మండలంలోని లింగట్ల గ్రామానికి చెందిన యువరైతు సాబ్లే సుభాష్ బుధవారం ఉదయం తన పొలంలో పత్తి పంటకు కలుపు తీయుతుండగా ప్రమాదవశాత్తు వేలాడుతున్న విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి యువరైతు బలి
X

దిశ, నేరడిగొండ : నేరడిగొండ మండలంలోని లింగట్ల గ్రామానికి చెందిన యువరైతు సాబ్లే సుభాష్ బుధవారం ఉదయం తన పొలంలో పత్తి పంటకు కలుపు తీయుతుండగా ప్రమాదవశాత్తు వేలాడుతున్న విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం, విద్యుత్ తీగ గత కొంతకాలంగా ప్రమాదకరంగా వేలాడుతుండడంతో సంబంధిత అధికారులను పలు మార్లు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోకపోవడం, అప్రమత్తం కావడం లేదని వాపోతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిరుపేద యువరైతు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్ర్భాంతి కలిగిస్తోంది. ఈ ఘటనపై బాధ్యత వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, మృతుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story