- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుదాఘాతంతో రైతు మృతి
by Ratna Kumari |
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన ఉమ్మిడి కోడేరు మండలం గుండియా వాల్యా నాయక్ తండాలో ఆదివారం చోటు చేసుకుంది.

X
దిశ, కోడేరు : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన ఉమ్మిడి కోడేరు మండలం గుండియా వాల్యా నాయక్ తండాలో ఆదివారం చోటు చేసుకుంది. కోడేరు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ బి.రాజు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు ఉమ్మడి మండలం గుండియా వాల్యా నాయక్ తాండాలో కాట్రావత్ లోకారం నాయక్(39) తన వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంట వేశారు. అయితే ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లి బావి మోటర్ స్టార్టర్ ఆన్ చేస్తున్న క్రమంలో స్టార్టర్ నుంచి బావి మోటారు గల వైరు తెగిపోవడంతో వైరు కాలుకు తగిలి ప్రమాదవశాత్తు విద్యుదా ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య కమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు.
Next Story






