విద్యుదాఘాతంతో రైతు మృతి

by Ratna Kumari |

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

విద్యుదాఘాతంతో రైతు మృతి
X

దిశ‌, న‌వాబుపేట : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని మేగ్యా నాయ‌క్ తండాకు చెందిన మేగావ‌త్ వెంక‌టేష్ (47) త‌న వ్య‌వ‌సాయ పొలంలో సాగు చేసిన ప‌ల్లి పంట‌కు సాగునీటిని స‌ర‌ఫ‌రా చేయ‌డం కోసం బోరు మోటార్ ఆన్ చేయ‌డానికి వెళ్లాడు. వెంక‌టేష్ చేతికి స్టాట‌ర్ డ‌బ్బా ప‌క్క‌నే తేలి ఉన్న స‌ర్వీస్ వైర్ త‌గ‌ల‌డంతో విద్యుదాఘాతానికి గురై అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. సాయంత్రం అయినా ఇంటికి రాక‌పోవ‌డంతో ఆయ‌న భార్య ల‌క్ష్మీ త‌న బాబాయి వాల్యా నాయ‌క్ తో క‌లిసి పొలం వ‌ద్ద‌కు వెళ్లింది. అప్ప‌టికే క‌రెంట్ షాక్ కు గురై మృతి చెంది ఉన్నాడు. భార్య ల‌క్ష్మీ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్సై విక్ర‌మ్ తెలిపారు.

Next Story