ప్రముఖ కవి ఆచార్య డాగోజీరావు మృతి

by Ratna Kumari |

ప్రముఖ కవి, విశ్రాంత ఆచార్యులు కమలేకర్ డాగోజీ రావు ఆదివారం ఉదయం మరణించారు.

ప్రముఖ కవి ఆచార్య డాగోజీరావు మృతి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రముఖ కవి, విశ్రాంత ఆచార్యులు కమలేకర్ డాగోజీ రావు ఆదివారం ఉదయం మరణించారు. ఆయన రచించిన ఆధ్యాత్మిక రచనలతో బాలసాహిత్య రచనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. కళాశాల స్థాయి నుండి రచనా వ్యాసంగాన్ని ప్రారంభించిన డాగోజీ రావు హిందీ ఆచార్యునిగా పనిచేసినప్పటికీ తెలుగు సాహిత్యం పై పట్టు సాధించి అనేక రచనలు చేసి గుర్తింపు పొందారు. దాశరథి రంగాచార్యులు, గడియారం రామకృష్ణ శర్మ, సి.నారాయణ రెడ్డి, ఎల్లూరు శివారెడ్డి, కసిరెడ్డి వెంకటరెడ్డి, నందిని సిద్ధారెడ్డి, డాక్టర్ మసన చెన్నప్ప, వంటి ప్రముఖ కవులు పాల్గొన్న సాహిత్య సభల్లో పాల్గొని సన్మానాలు అందుకున్నారు. వీరి మృతి పట్ల పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, కవి, ఉపాధ్యాయుడు జి.చక్రవర్తి గౌడ్, ఉమ్మడి జిల్లా సాహిత్య సంస్థలు, జిల్లా ఒక గొప్ప కవిని కోల్పోయిందని సంతాపం ప్రకటించాయి.

Next Story