- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోనసీమలో దారుణం.. మైనర్‌పై ప్రముఖ పార్టీ నేత అత్యాచారం
తునిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన మరువక ముందే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది.

దిశ, వెబ్‌డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం బాణాపురం గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలికపై జనసేన పార్టీకి చెందిన రాయపురెడ్డి సత్యవెంకట కృష్ణ అలియాస్ ఆర్ బాబీ పైశాచికత్వం ప్రదర్శించాడు. ఐదవ తరగతి చదువుతున్న బాలికను స్కూల్ సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న ఒక భవనంలోకి తీసుకెళ్లి వికృత చేష్టలు చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. స్కూల్ పూర్తయిన తర్వాత బాలిక ఆ భవనం నుంచి బయటికి వస్తుండటం గమనించిన బాలిక తల్లి.. ఏం జరిగిందని ప్రశ్నించింది. దీంతో బాలిక తన తల్లికి జరిగింది వివరించింది.
వెంటనే బాలిక తల్లి, బంధువులతో కలిసి జిల్లా ఎస్పీకి ఘటనపై ఫిర్యాదు చేయగా.. ఎస్పీ ఆదేశాల మేరకు పోలవరం పోలీస్ స్టేషన్ అధికారులు బాలిక తల్లి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. నిందితుడు బాబీపై పోక్సో చట్టంలోని సెక్షన్ 6, సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు. కొద్దిరోజుల క్రితం కాకినాడ జిల్లా తునిలో మైనర్ పై అత్యాచారం జరిగిన ఘటన మరువకముందే.. మరో ఘటన వెలుగు చూడటం బాలికల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.






