నగరంలో ఫేక్ IAS అధికారి అరెస్ట్.. బాధితుల నుంచి రూ.10 లక్షలు వసూలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-26 08:05:23  IST  )

ఓ వైపు రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు ప్రజల జేబులు గుల్ల చేస్తుంటే మరోవైపు కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు.

నగరంలో ఫేక్ IAS అధికారి అరెస్ట్.. బాధితుల నుంచి రూ.10 లక్షలు వసూలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) ప్రజల జేబులు గుల్ల చేస్తుంటే మరోవైపు కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ నగరంలోని ఫిల్మ్‌నగర్ పరిధిలో ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్‌ (Fake IAS Officer)గా చలామణి అవుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్‌నగర్ పరిధిలో నివాసం ఉంటున్న శశికాంత్ (Shashikanth) అనే వ్యక్తి తనకు తానుగా ఐఏఎస్ అని చెప్పుకుంటూ హల్‌చల్ చేస్తున్నాడు. ఏకంగా ఇద్దరు గన్‌మెన్లు, ఫేక్ ఐడీ కార్డులను పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. నగర శివార్లలో నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్ల వద్దకు వెళ్లి బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పిస్తానని బాధితుల నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ బాధితుడు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చిందు. అసలు అతడు ఐఏఎస్ ఆఫీసరే కాదని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Next Story