లాభాల కోసం క్లిక్ చేస్తే.. లక్షల నష్టం డౌన్‌లోడ్ అయ్యింది..!

by Bhanu |

ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు.

లాభాల కోసం క్లిక్ చేస్తే.. లక్షల నష్టం డౌన్‌లోడ్ అయ్యింది..!
X

దిశ, అలంపూర్: ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. అందుబాటులోకి వస్తున్న ఫాస్ట్ సాంకేతికతను ఉపయోగిస్తూ కొత్త కొత్త యాప్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా పరిచయమై సామాన్య ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా కూడా మోసాలు జరుగుతున్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించడంతో పాటు డబ్బులు కూడా కాజేస్తున్నారు. ఇప్పుడు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫారం ఫేస్ బుక్ లో కొత్త తరహా మోసం వెలుగుచూసింది. ‘గోల్డ్ బ్లాక్ చైన్ పేరిట దీనిని రన్ చేస్తు.. మీరు ఈ యాప్ నందు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే.. మీ డబ్బులకు 20% బెనిఫిట్ వెనువెంటనే ఇస్తామని నమ్మబలికి సామాన్య వ్యక్తులను బురిడీ కొట్టిస్తున్నారు.

అందులో భాగంగా జోగులంబ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణానికి చెందిన వెంకటేష్ ఈ విధంగానే మోసపోయి సుమారు 8 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ఫేస్ బుక్ లో పరిచయమైన ఓ వ్యక్తి గోల్డ్ బ్లాక్ లో డబ్బులు జమ చేస్తే మీ డబ్బులకు 20% బెనిఫిట్ వెనువెంటనే వస్తుందని మొదటగా నమ్మబలికాడు. వెంకటేష్ డబ్బులు వస్తాయని ఆశతో ఏకంగా అకౌంట్ నుండి 8 లక్షల రూపాయలను వారి యాప్ నందు డిపాజిట్ చేశాడు. ఫేస్బుక్ యాప్ నందు తన అకౌంట్ కు 34 లక్షలు రూపాయలు క్రెడిట్ అయినట్లు కూడా చూపించారు.

ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తికి ఫోన్ చేయగా 15 లక్షలు ట్యాక్స్ పడుతుందని ఆ డబ్బులు పే చేయడానికి రాదని చెప్పడంతో తాను మోసపోయానని వెన్న వెంటనే సైబర్ క్రైమ్ వారి 1930 నంబర్కు కాల్ చేసి జరిగింది చెప్పుకున్నాడు. వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెనివెంటనే అకౌంటును హోల్డ్ చేయించి దర్యాప్తు చేస్తున్నామని శాంతినగర్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సైబర్ మోసాలకు ఎవరు కూడా బలికావద్దని.. ఫేస్బుక్, సోషల్ మీడియాలో వస్తున్న యాప్ లను డౌన్లోడ్ చేసుకొని ఇలా చాలామంది మోసపోతున్నారని, ఆన్లైన్లో వస్తున్న యాప్స్ జోలికి వెళ్ళవద్దని సూచించారు.



Next Story