- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొంపముంచిన ఫేస్‌బుక్ దోస్తాన్.. రూ.12.7 లక్షలకు కుచ్చుటోపీ
ఫేస్‌బుక్‌లో పరిచయమైన లండన్ మహిళను నమ్మి మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి రూ. 12.7 లక్షలు పోగొట్టుకున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను నిండా ముంచేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh)కు చెందిన ఓ వ్యక్తి, ఫేస్‌బుక్ (Facebook)లో పరిచయమైన ఓ మహిళను నమ్మి ఏకంగా రూ.12.7 లక్షలు పోగొట్టుకున్నాడు. లండన్ నుంచి బహుమతులు పంపిస్తున్నానని, 95,000 పౌండ్ల నగదు ఇస్తానని చెప్పి మోసగాళ్లు అతన్ని బుట్టలో వేసుకున్నారు.
మాయమాటలతో వల..
బాధితుడికి కొన్ని రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో ఓ మహిళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె తనను తాను లండన్ నివాసిగా పరిచయం చేసుకుంది. కొద్దిరోజుల చాటింగ్ తర్వాత ఆమె బాధితుడికి సుమారు 95,000 పౌండ్ల విలువ గల భారత కరెన్సీలో రూ.12.7 లక్షల బహుమతులు పార్శిల్‌గా పంపిస్తున్నట్లుగా నమ్మించింది. అయితే, కొద్దిరోజుల తర్వాత బాధితుడికి కస్టమ్స్ (Customs Duty) అధికారులమంటూ అంటూ ఫోన్ వచ్చింది. ‘మీ పేరు మీద విదేశాల నుంచి భారీ నగదు, గిఫ్ట్‌లు వచ్చాయని, వాటిని తీసుకోవాలంటే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని’ అంటూ తెలిపారు. ఆ తర్వాత ఇన్‌కం టాక్స్, ఫారిన్ కరెన్సీ ఎక్స్ఛేంజ్, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో రకరకాల ఛార్జీలను బాధితుడి నుంచి వసూలు చేశారు. ఆ మహిళ కూడా ఫోన్ చేసి, తాను పంపిన డబ్బు రాకపోతే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని భయపెట్టింది. దీంతో బాధితుడు విడతల వారీగా మొత్తం రూ.12.7 లక్షలను మోసగాళ్లు చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేశాడు.
చివరికి నిజం తెలుసుకుని..
అయితే, తాను డబ్బు కట్టినా పార్శిల్ అందకపోవడం, అవతలి వ్యక్తి మరిన్ని నిధుల కోసం ఒత్తిడి చేయడంతో బాధితుడికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం తాను హనీ ట్రాప్, గిఫ్ట్ స్కామ్‌కు గురైనట్లు గుర్తించి లబోదిబోమన్నాడు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆ బ్యాంకు ఖాతాల వివరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.






