- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్లో ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు.. డ్రగ్స్ అమ్ముతున్న నలుగురు అరెస్ట్
తెలంగాణ (Talangana)లో డ్రగ్స్ అనే మాటే వినపడకుండా చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్టేట్‌మెంట్ ఇచ్చి విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Talangana)లో డ్రగ్స్ అనే మాటే వినపడకుండా చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్టేట్‌మెంట్ ఇచ్చి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మత్తు పదర్థా వినియోగం, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆయన పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులు ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బంది ఆర్డర్స్ పాస్ చేశారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌ఓటీ (SOT), ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు (Railway Stations), ఎయిర్‌పోర్టు (Airports)లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ ఎక్కడికక్కడ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే శంషాబాద్ (Shamshabad) పరిధిలో డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేపట్టారు. అయితే, పశ్చిమ్ బెంగాల్ (West Bengal) రాష్ట్రం నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ (Hyderabad)లో విక్రయిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 70 గ్రాముల బ్రౌన్ షుగర్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






