- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Srishti case: ‘సృష్టి’ కేసులో ఎస్కేప్ ప్లాన్.. విదేశాలకు పారిపోతున్న లేడీ డాక్టర్ అరెస్టు
సృష్టి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో (Srishti Fertility Case) సంచలనాలు నమోదు అవుతున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్లుగా పాన్ ఇండియా లెవల్‌లో డాక్టర్ నమ్రత (Dr.Namrata) అక్రమాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నమ్రతను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తుండగా ఇన్నాళ్లు ఆమె చేసిన అక్రమాల్లో భాగస్వామ్యం ఉన్నవారి వెన్నులో వణుకుపుడుతోంది. దీంతో తమ పేరు బయటపడకముందే విదేశాలకు ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లేడీ డాక్టర్ విద్యుల్లతతో పాటు మరో 9 మందిని అరెస్టు చేశారు. వైద్యురాలు విదేశాలకు పారిపోతుండగా అదుపులోకి తీసుకోవడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. ఇప్పటి వరకు ఈ కేసులో 18 మందిని అరెస్టు చేయగా తాజాగా అరెస్టు చేసిన 9 మందిని మరికాసేపట్లో పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.
ఫేక్ లెటర్ హెడ్‌లు..
‘సృష్టి’ నిర్వాహకురాలు నమ్రత కేసులో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్న డా.నమ్రత సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ లెటర్‌హెడ్‌లు వాడినట్లు గుర్తించారు. తన పేరుతో ఉన్న లెటర్‌హెడ్ చూసి ఆశ్చర్యానికి గురైన ఓ వైద్యురాలు నమ్రతపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.






