- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెచ్చిపోయిన ATM దొంగలు.. గంటల వ్యవధిలో రెండు చోట్ల చోరీకి యత్నం
నిజామాబాద్ Nizamabad) జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున ఏటీఎం (ATM) దొంగలు రెచ్చిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ Nizamabad) జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున ఏటీఎం (ATM) దొంగలు రెచ్చిపోయారు. గంటల వ్యవధిలో రెండు వేర్వేరు బ్యాంకు ఏటీఎంలలో చోరీకి యత్నించి, మెషీన్లు తెరుచుకోకపోవడంతో దుండగులు వాటిని తగలబెట్టేశారు. ఈ ఘటనతో సుమారు రూ.37 లక్షల నగదు బూడిదైపోయింది. వివరాల్లోకి వెళితే.. దుండగులు ముందుగా సాయినగర్ (Sai Nagar)లోని ఎస్‌బీఐ (SBI) ఏటీఎంపై దాడి చేశారు. అయితే, మెషిన్‌ను ఎలాగైన తెరవాలని గ్యాస్ కట్టర్‌తో ప్రయత్నించగా అందులోని సమారు రూ.10 లక్షల నగదు పూర్తిగా కాలిపోయింది.
అనంతరం ఆర్యనగర్ (Arya Nagar)లోని డీసీబీ (DCB) బ్యాంకు ఏటీఎంపై కూడా ఇదే తరహా ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా ప్రయత్నం విఫలం కావడంతో మెషిన్‌ను దగ్ధం కావడంతో రూ.27 లక్షల నగదు దగ్ధమైంది. మొత్తంగా రెండు ఏటీఎంలలో కలిపి రూ.37 లక్షలకు పైగా నగదు అగ్నికి ఆహుతైంది. కాాాగా, దొంగలు బైక్‌లు, కార్లు ఉపయోగించి ఏటీఎం మెషిన్ల వద్ద రెక్కీ చేసినట్లుగా సీసీటీవీ ఫుటేజీలో తేలింది. బ్యాంకు సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.






