- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gangster Nayeem: నయీం కేసులో ఈడీ దూకుడు.. మొత్తం ఎన్ని చోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
గ్యాంగ్‌స్టర్ నయీం(Gangster Nayeem) ఆస్తులను జప్తు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: గ్యాంగ్‌స్టర్ నయీం(Gangster Nayeem) ఆస్తులను జప్తు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తం 35 చోట్ల నయీంకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. నయీం కుటుంబసభ్యుల పేర్ల మీద అవన్నీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు నిర్ధారించారు. అక్రమంగా, బలవంతంగా నయీం తన కుటుంబసభ్యుల పేర్ల మీద ఆస్తులు రిజిస్టర్ చేయించినట్లు ఈడీ అంచనాకు వచ్చింది. 2020 మార్చిలో నయీంపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు(Money Laundering Case)ను నమోదు చేసిన విషయం తెలిసిందే.
అప్పటినుంచి ఐటీ అధికారులు, సిట్ సమాచారంతో ఈసీఐఆర్(Enforcement Case Information Report) నమోదు చేసింది. అయితే ఆస్తులకు సంబంధించి సమన్లు పంపించినా నయీం కుటుంబసభ్యులు ఎవరూ స్పందించడం లేదు. మరోవైపు కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్స్(IT Returns) కూడా ఫైల్ చేయలేదు. ఈ క్రమంలోనే నయీం ఆస్తులను జప్తు చేయాలని ఈడీ నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలోనే తాజాగా చర్యలు ప్రారంభించింది.
మరోవైపు.. నయీం 2016 ఆగస్టులో షాద్‌నగర్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్(Encounter)లో మరణించిన విషయం తెలిసిందే. నయీం మరణించడంతో అతని బాధితులంతా బయటకు వచ్చి ఫిర్యాదులు చేశారు. వీటిని విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది. విచారణలో దాదాపు 250 కేసులు నమోదు చేశారు. ఇందులో 27 హత్య కేసులతో పాటు అనేక నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. వీటికి సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ వీటి దర్యాప్తు పూర్తికాలేదు.






