- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరెంటు షాక్ తో విద్యుత్ కూలీ మృతి
11 కేవీ విద్యుత్ లైన్ లో జంపర్ కలపడానికి వెళ్ళి విద్యుత్ షాక్ కు గురైన విద్యుత్ లైన్ మరమ్మతు పనులు చేసే కూలి వెంకటయ్య (35) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు

దిశ, కందనూల్ : 11 కేవీ విద్యుత్ లైన్ లో జంపర్ కలపడానికి వెళ్ళి విద్యుత్ షాక్ కు గురైన విద్యుత్ లైన్ మరమ్మతు పనులు చేసే కూలి వెంకటయ్య (35) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్ లో మరమత్తు పనుల కోసం కొల్లాపూర్ మండలం కోడికిల గ్రామం నుంచి వచ్చిన కూలి చేత ఇతర విద్యుత్తు పని చేయించడంతో విద్యుత్ షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషషన్ లో మరమ్మత్తుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ముందుగానే ప్రకటించిన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపియడంలో నిర్లక్ష్యంగా వహించినట్లుగా తెలుస్తోంది. విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యుత్ పనులపై అవగాహన లేని, విద్యుత్ శాఖకు సంబంధం లేని మామూలు దినసరి కూలి చేత విద్యుత్ సరఫరా ఉన్నచోట ఎందుకు పని చేపించారనేది ప్రశ్నార్థకంగా ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.






