- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
electric shock : విద్యుదాఘాతంతో అన్నదాత దుర్మరణం
by Sridhar Babu |
విద్యుదాఘాతంతో (electric shock)అన్నదాత మృతి చెందాడు.

X
దిశ, మామడ : విద్యుదాఘాతంతో (electric shock)అన్నదాత మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రెడ్డి చిన్న భీమన్న(46) (Bhimanna)పంట చేనులోని పసుపు పంటకు నీరు పెట్టడానికి వెళ్లి నీరు చివరివరకు చేరిందో లేదోనని తిరుగుతుండగా తోటలోని కరెంటు వైర్ ప్రమాదవశాస్తు తన ఎడమ చేతికి తగలడంతో అక్కడికక్కడే మరణించాడు.
రాత్రి అయినా భీమన్న ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది తోటలోకి వెళ్లి చూడగా విగత జీవిగా కనిపించాడు. అందరితో కలిసిమెలిసి ఉండే కష్టజీవి అనంత లోకాలకు వెళ్లడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ పేర్కొన్నారు.
Next Story






