వృద్ధురాలు ఆత్మ‌హ‌త్య‌..!

by Ratna Kumari |

దిశ-బూర్గంపాడు : పురుగుల మందు తాగి ఓ వృద్ధురాలు ఆత్మహత్యయత్నానికి పాల్పడి

వృద్ధురాలు ఆత్మ‌హ‌త్య‌..!
X

దిశ-బూర్గంపాడు : పురుగుల మందు తాగి ఓ వృద్ధురాలు ఆత్మహత్యయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బూర్గంపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గంపాడు మండల పరిధిలోని పినపాకపట్టినగర్ గ్రామానికి చెందిన అదెమ్మ (63) తన భర్త వెంకటేశ్వర్లుతో కలిసి పాల్వంచలోని తన మనువడు వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గరు కుమార్తెలు. సోమవారం భద్రాచలం వెళ్లి తిరిగి పాల్పంచ వెళ్తున్న అదెమ్మ పినపాకలో దిగి ఇంటికి చేరుకుంది. చుట్టుప్రక్కల వాళ్లతో ముచ్చటించిన ఆమె కొంత సమయం తర్వాత గ్రామంలోని వైకుంఠధామం సమీపంలో పురుగులమందు ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. గమనించిన స్థానికులు ఆమెను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కొత్తగూడెం తీసుకెళ్లగా.. అక్క‌డ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. గత కొంతకాలంగా మానసిక సమస్యలతో భాదపడుతూ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతురాలు మనుమడు రమేష్ బాబు ఫిర్యాదు మేరకు అదనపు ఎస్ఐ నాగభిక్షం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story