- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరేసుకొని వృద్ధురాలు ఆత్మహత్య
by Ratna Kumari |
మందమర్రి పట్టణం మూడో జోన్ లో నివాసం ఉంటున్న గసికంటి శంకర్ తల్లి కాంతమ్మ (85) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

X
దిశ, మందమర్రి : మందమర్రి పట్టణం మూడో జోన్ లో నివాసం ఉంటున్న గసికంటి శంకర్ తల్లి కాంతమ్మ (85) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వారం రోజుల క్రితం శంకర్ భార్య, రెండు రోజుల క్రితం శంకర్ కూడా వేర్వేరు పనులపై ఊరిలో లేరు. ఆదివారం ఉదయం ఇంట్లో కాంతమ్మ మనవడు వెంకటేష్ మాత్రమే ఉన్నారు. వెంకటేష్ తన స్నేహితుడి వివాహ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఆదివారం అర్ధ రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన వెంకటేష్ కి తన నానమ్మ ఇంట్లో ఉరి వేసుకొని కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. గత నాలుగు రోజులుగా అనారోగ్యం కారణంగా సరిగ్గా ఆహారం తీసుకోలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం లో పేర్కొన్నారు. మృతురాలి కుమారుడు శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ గోపతి నరేష్ తెలిపారు.
Next Story






