హైదరాబాద్‌లో దారుణం.. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో పడి వృద్ధుడు మృతి

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-13 11:01:08  IST  )

హైదరాబాద్‌(Hyderabad)లోని ఓల్డ్ సిటీలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లో దారుణం.. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో పడి వృద్ధుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లోని ఓల్డ్ సిటీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అపార్టెంట్ లిఫ్ట్‌లో పడి వృద్ధుడు మృతి(Elder Man Dead) చెందాడు. ఈ ఘటన చంద్రాయణగుట్ట(Chandrayangutta)లో జరిగింది. లిఫ్ట్‌లో ఐదో అంతస్తు నుంచి పడినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. లిఫ్ట్ ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. బటన్ నొక్కగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిందని.. లిఫ్ట్ రాకపోవడంతో చూసుకోకుండా కాలు పెట్టి.. ఐదో అంతస్తు నుంచి పడిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు భవన యజమాని నిర్లక్ష్యంపై నివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story