Crime News: చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. అర్ధరాత్రులు దగ్గరకు వచ్చి మరీ

by Disha Web Desk 7 |
Crime News: చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. అర్ధరాత్రులు దగ్గరకు వచ్చి మరీ
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళలపై మగవారు లైంగిక దాడులకు పాల్పడుతున్నారని నిత్యం మనం వార్తల్లో చూస్తుంటాము. కానీ, ఆడవారిపై ఆడవారు కూడా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో కలకలం రేపుతుంది. సొంత అక్కే తన చెల్లిపై లైంగిక దాడికి పాల్పడింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మహారాష్ట్రలోని పూణే జిల్లాలో విమానగర్ ప్రాంతానికి చెందిన ఓ అక్క(24), చెల్లి(18) ఒకే ఇంట్లో ఉంటున్నారు. అక్క ఉన్నత చదువులు చదువుకుంది. అంతే కాదు ఆమెకు వివాహం కూడా జరిగింది. అయితే కొంత కాలం అక్క దగ్గర ఉండేందుకు చెల్లెలు ఇటీవల వారి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలోనే చెల్లెలు ఒంటిరిగా నిద్రించేటప్పుడు అక్క తన వద్దకు వెళ్లి తప్పుగా బిహేవ్ చేసేది. అది తప్పని చెప్పిన వినిపించుకునేది కాదు. ఇక అదే విధంగా ఈ నెల 23 న కూడా చెల్లెలు హాల్‌లో నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి అక్క వెళ్లి ఆమెను లైంగికంగా వేధించింది. దీంతో అక్క చేసే పని తట్టుకోలేక.. ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కాక చెల్లి పోలీసులను ఆశ్రయించింది. చెల్లెలు ఫిర్యాదుతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.


Next Story

Most Viewed