నటి రన్యా‌రావుకు షాకిచ్చిన ఈడీ.. రూ.34 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌

by Kema Shiva Kumar |

కన్నడ నటి రన్యారావు (Ranya Rao)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దిమ్మతిరిగే షాకిచ్చింది.

నటి రన్యా‌రావుకు షాకిచ్చిన ఈడీ.. రూ.34 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ నటి రన్యారావు (Ranya Rao)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దిమ్మతిరిగే షాకిచ్చింది. గోల్డ్ స్మగ్లింగ్‌ (Gold Smuggling) వ్యవహారం ఆమెపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో తాజాగా రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను ఇవాళ అధికారులు జప్తు చేశారు. కాగా, రన్యారావు మార్చి 3, 2025న బెంగళూరు (Bengaluru)లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ (Dubai) నుంచి రూ.12.56 కోట్ల విలువైన 14.2 కేజీల బంగారు బిస్కెట్లను శరీరంపై బ్యాండేజీలతో దాచి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. దీంతో ఆమెపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసింది. అనంతరం రన్యారావు నివాసంలో జరిపిన సోదాల్లో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల లిక్విడ్ క్యాష్ కూడా లభించింది. నవంబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు రన్యారావు రూ.40.13 కోట్ల విలువైన 49.6 కేజీల స్మగ్లింగ్ బంగారాన్ని హవాలా డీలర్ సాహిల్ సకరియా జైన్ (Sahil Sakaria Jain) సాయంతో ఇతర దేశాలకు విక్రయించినట్లుగా దర్యాప్తు వెల్లడైంది. నిందితురాలు రన్యారావు నకిలీ కన్సల్టెన్సీ ఫీజులు, షెల్ కంపెనీల ద్వారా రూ.కోట్లలో అక్రమార్జనకు పాల్పడినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో కేసులో హవాలా లావాదేవీలు, వాటి నెట్‌వర్క్‌‌ను ఛేదించేలా ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story