HCAపై ఈడీ కేసు నమోదు

by Gantepaka Srikanth |

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌(Hyderabad Cricket Association)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు కేసు నమోదు చేశారు.

HCAపై ఈడీ కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌(Hyderabad Cricket Association)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు కేసు నమోదు చేశారు. ECIR కింద మొత్తం ఐదుగురిపై PMLA సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. బీసీసీఐ నిధుల విషయంలో మనీలాండరింగ్ ఆరోపణలు జరిపినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, శ్రీనివాస రావు, రాజేంద్ర యాదవ్, సునీల్ కాంటే, జి.కవితపై ఈడీ కేసులు నమోదయ్యాయి. వీరందరినీ ఈడీ కస్టడికీ కోరనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న సీఐడీ కస్టడీ ముగియగానే.. ఈడీ విచారణ మొదలు కానుంది.

బీసీసీఐ నుంచి పెద్దమొత్తంలో నిధులు మంజూరయ్యాయని, తప్పుడు బిల్లులతో నిందితులు వీటిని తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇలా జరిగి ఉంటే.. ఈడీ చట్టపరమైన చర్యలు చేపడుతుంది.

Next Story