- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో డ్రగ్స్ పట్టివేత.. వైసీపీ స్టూడెంట్ వింగ్ విశాఖ అధ్యక్షుడి కోసం తీసుకెళ్తున్నట్లు అనుమానం
దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్ పట్టుబడటం కలకలం గా మారింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకోగా.. టాస్క్‌ఫోర్స్, ఈగల్ టీమ్ సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించింది.

దిశ, వెబ్ డెస్క్: దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్ (Drugs) పట్టుబడటం కలకలం గా మారింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకోగా.. టాస్క్‌ఫోర్స్, ఈగల్ టీమ్ (Task Force, Eagle Team) సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, డ్రగ్స్‌ను నగరంలోని కొంతమంది వ్యక్తులకు సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చినట్లు అనుమానం వ్యక్తమైంది. అధికారులు పట్టుబడ్డ మాదకద్రవ్యాల నమూనాలను విశ్లేషణకు పంపించారు.
ఇదే కేసులో రాజకీయ కోణం కూడా వెలుగులోకి వస్తుంది. వైసీపీ విద్యార్థి విభాగం విశాఖ అధ్యక్షుడు కొండారెడ్డి (Konda Reddy) కోసం ఈ డ్రగ్స్ తెచ్చారని ప్రాథమిక విచారణలో బయటపడినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్, ఈగల్ టీమ్‌లు కొండారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్న వ్యక్తులపై కూడా అధికారులు దృష్టి సారించారు. డ్రగ్స్ సరఫరా గొలుసును పూర్తిగా అణచివేయడమే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ (Task Force) అధికారులు స్పష్టం చేశారు.






