- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నానక్‌రామ్‌గూడ ఐటీ కారిడార్‌లో నీతూబాయి డెన్ పై ఈగల్ ఫోర్స్ ఫోకస్
రాష్ట్ర రాజధాని, హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ఐటీ కారిడార్‌ను కేంద్రంగా చేసుకుని సాగుతున్న భారీ గంజాయి దందాను ఛేదించేందుకు ఈగల్ బృందం 'ఆపరేషన్ ఈగల్' ప్రారంభించింది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర రాజధాని, హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ఐటీ కారిడార్ (IT Corridor)ను కేంద్రంగా చేసుకుని సాగుతున్న భారీ గంజాయి దందాను ఛేదించేందుకు ఈగల్ బృందం 'ఆపరేషన్ ఈగల్' ప్రారంభించింది. గతంలో పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి విడుదలైన మోస్ట్ వాంటెడ్ గంజాయి స్మగ్లర్ నీతూబాయి (Ganja smuggler Neetu Bhai) కుమారులైన ఖాలు సింగ్, గౌతమ్‌ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నానక్‌రామ్‌గూడ (Nanakramguda)లోని ఒక బస్తీని అడ్డాగా మార్చుకుని, అక్కడి నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, విద్యార్థులే లక్ష్యంగా రోజుకు లక్షల రూపాయల వ్యాపారం సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నీతూబాయి ఇప్పటికే 12 కేసులు నమోదు కాగా, ఆమె కుమారులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
ఐటీ కారిడార్‌లో నిఘా నీడ గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ పరిసరాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ఈ ముఠాను పట్టుకునేందుకు ఈగల్ బృందం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలువురు సప్లయర్లను, వినియోగదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితులైన ఖాలు సింగ్, గౌతమ్ కోసం జల్లెడ పడుతున్నారు. ఐటీ కారిడార్‌లోని హాస్టళ్లు, పబ్‌లు, బస్తీల్లో ఈగల్ ఫోర్స్ సోదాలు నిర్వహిస్తోంది. మాదకద్రవ్యాల రహిత హైదరాబాద్‌ను రూపొందించడంలో భాగంగా, ఈ 'లేడీ డాన్' గంజాయి నెట్‌వర్క్‌ను పూర్తిగా తుడిచిపెట్టే వరకు వేట కొనసాగుతుందని ఈగల్ ఫోర్స్ ఉన్నతాధికారులు హెచ్చరించారు.






